ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామంలో రూ. లక్ష విలువ చేసే సెంట్రింగ్ బాక్సులు చోరీకి గురయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గురువారం చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. కనిగిరి కోర్టు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించినట్లుగా ఎస్ఐ మహేంద్ర తెలిపారు.