ప్రకాశం జిల్లా పొదిలి నూతన సిఐగా టి. వెంకటేశ్వర్లు శుక్రవారం నియమితులయ్యారు. గుంటూరు విఆర్ లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లను పొదిలి సిఐ గా బదిలీ చేస్తూ గుంటూరు రేంజి ఐజిపి ఉత్తర్వులు జారీ చేశారు. పొదిలి సిఐగా పనిచేస్తున్న మల్లికార్జున రావును గుంటూరు వీఆర్ లో రిపోర్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో వెంకటేశ్వర్లు నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.