రాష్ట్ర టి. ఎన్. టి. యు. సి. ఆర్గనైజింగ్ సెక్రటరీ దూదేకుల మస్తానయ్య మంత్రి నారా లోకేష్'ను శుక్రవారం రాత్రి మంత్రి నివాసము వద్ద కలిసినట్లు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అనుచరునిగా కొనసాగుతూ 25 సంవత్సరముల నుండి పార్టీకి సేవ చేస్తూ ఉన్నానని అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అధికంగా ఉన్న దూదేకుల నూర్ భాషా కులస్తులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్'గా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు.