కొనకలమిట్ల మండలం అంబాపురం గ్రామంలోని బాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఆలయంలోని హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ. 20 వేలు నగదును దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. ఉదయాన్నే పూజలు చేసేందుకు వచ్చినా అర్చకుడు దొంగలు పడ్డారని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల వేలిముద్రలను క్లూస్ టీం సహాయంతో సేకరించారు.