మార్కాపురం ప్రభుత్వాసుపత్రిని బుధవారం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో 6 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఆయన దృష్టికి రావడంతో ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జనరేటర్ ఉండి కూడా ఎందుకు ఉపయోగించలేదని ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య అందించాలని ఆదేశించారు.