మద్యం పాలసీలో ఎటువంటి బెదిరింపులకు తావు లేదని మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ బాలయ్య అన్నారు. గురువారం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. మద్యం పాలసీపై కొందరు అపోహలకు గురవుతున్నారని ప్రభుత్వం మద్యం పాలసీని విజయవంతం చేసేందుకు కృతనిచయంతో ఉందన్నారు. కాబట్టి ఎవరు మద్యం పాలసీపై అపోహలు పెట్టుకోవద్దన్నారు. వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు.