రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దూదేకుల మస్తానయ్య మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించారు. దూదేకుల మస్తానయ్య మంత్రితో మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అడుగుజాడలలో నడుచుకుంటూ పార్టీకి విధేయుడుగా క్రమశిక్షణ విధేయతతో మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న తనను దూదేకుల కార్పొరేషన్ చైర్మన్'గా నియమించడానికి అవకాశం కల్పించవలసిందిగా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలని కోరారు. అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా నుండి ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.