పెద్దారవీడు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో నీటి కుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వై. పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఆ మృతదేహాలను సోమవారం సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.