ఒంగోలులో జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ గా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆరోగ్య పరిస్థితిని ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దుతానని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు రాకుండా వాటిని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.