మద్దిపాడు మండలంలోని గుళ్ళపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హరిజనవాడకు చెందిన చినిగే విజయమ్మ రాత్రి సమయంలో హైవే వంతెన వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మద్దిపాడు ఎస్ఐ మహేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.