వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదని ఎర్రగొండపాలెం టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆరోపించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని ప్రజలను నమ్మించి మోసం చేసినజగన్ మోహన్ రెడ్డికి వెలుగొండ ప్రాజెక్టుపై ఏం అర్హత ఉందని మాట్లాడుతారో వైసిపి నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.