ప్రకాశం: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

85చూసినవారు
ప్రకాశం: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని గ్రంథపాలకుడు జి. రామాంజి నాయక్, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగంపై అవగాహన కల్పించడం సమాజ హితం కోసం కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్