ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎస్ఐ. తన సిబ్బందితో కలిసి మండలంలోని పుల్లలచెరువు, ఇసుక త్రిపురవరం, శతకోడు గ్రామాల్లో మెరుపు దాడులు చేసి పేకాట రాయుళ్ళని అదుపులోకి తీసుకోవడమైనది.
ఈ సందర్భంగా ఎస్సై ఫిరోజ్ ఫాతిమా మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన తమ దృష్టికి తీసుకురావాలనీ, వారి పైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అదుపులోకి తీసుకున్న వారిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.