ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని జాతీయ రహదారిపై హెచ్. పి పెట్రోల్ బాంక్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్రగొండపాలెంకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై మార్కాపురం వైపుకు వెళుతుండగా ఎదరుగా వస్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతి చెందిన వారు నూర్ మొహమ్మద్, ఆఫ్రోజ్ బేగ్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఇరుకుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.