అద్దంకి మండలంలో సోమవారం జరిగిన పదవ తరగతి మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ తెలిపారు. ఆరు సెంటర్లలో పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మొత్తం 1105 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 1101 మంది విద్యార్థులు హాజరై నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.