ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని పంగులూరు మండల వ్యవసాయ శాఖ అధికారి బి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పంగులూరు మండలంలోని చందలూరు, నూజిలపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులతో సుబ్బారెడ్డి మాట్లాడుతూ పంటలకు అధికంగా ఎరువులు వాడటం వలన భూసారం దెబ్బతింటుందని, పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే వాడాలని ఆయన కోరారు.