మరమ్మత్తుల దృష్ట్యా చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్ గేటును శుక్రవారం నుండి మూసివేయడంతో అక్కడికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్ణ రోడ్డు క్రాసింగ్ గేటు వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రాసింగ్ గేట్లకు అవతలి వైపు ఉన్న దండుబాట, స్వర్ణ నుండి ఈ గేట్ల మీదుగా రోజూ వేలాది మంది అటూ ఇటూ రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఒక క్రాసింగ్ గేట్ మూతపడడంతో వారికి మరో క్రాసింగ్ గేట్ దిక్కయింది.