దర్శి: వెలుగొండ ప్రాజెక్టుకు రూ. 2000 కోట్లు నిధులు కేటాయించాలి
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి రెండు వేల కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని సోమవారం దర్శి లోని తహసిల్దార్ కార్యాలయంలో సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.