
దర్శి: క్షేత్ర పర్యటనలో వ్యవసాయాధికారి మధుబాబు
కురిచేడు మండలం పడమటి నాయుడుపాలెం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మార్చి 31 లోపు ముఖ్యంగా పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ నందు 11 అంకెల విశిష్ట నెంబర్ కోసం నమోదు అవ్వాలని సూచించారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలకు సబ్సిడీలకు ఈ విశిష్ట నెంబర్ ముఖ్యమని రైతులకు తెలిపారు.