గిద్దలూరులో శుక్రవారం సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ బిల్లులపై అదనపు చార్జీలను వెంటనే రద్దు చేయాలని నిరసన తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై అదనపు భారం వేసి ప్రజల నడ్డి విరిచిందని సిపిఎం నాయకులు ఆవులయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ బిల్లులపై అదనపు చార్జీలు రద్దు చేస్తామని మాట ఇచ్చి 100 రోజులైనా హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.