ఘనంగా ముదిరాజ్ కార్తీక మాస వన సమారాధన

70చూసినవారు
ఘనంగా ముదిరాజ్ కార్తీక మాస వన సమారాధన
కనిగిరిలోని కేటీఆర్ స్కూల్ సమీపంలో ఆదివారం ముదిరాజ్ ల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు. ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ. మొదటిసారిగా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగడం ఆనందదాయకమని, కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్