ప్రకాశం జిల్లా వెలిగండ్లలోని బ్రాహ్మణ వీధిలో పంచాయతీ నిధులతో వేయించిన బోర్ ప్రజల దాహార్తిని తీర్చలేకపోతోంది.స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఏడాది క్రితం పంచాయతీ బోర్ మరమ్మత్తులకు గురైంది. స్థానిక నాయకులకి, అధికారులకి ఎంత చెప్పిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.దాదాపు 30కుటుంబాలకు ఈ బోరు ఆసరాగా ఉండగా అది పాడవడంతో పట్టించుకునే నాదుడే లేడని,తమ దాహార్తిని తీర్చాలని సోమవారం స్థానిక ప్రజలుఅధికారులను కోరుతున్నారు.