కనిగిరి: అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం

69చూసినవారు
కనిగిరి: అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం
కనిగిరి పట్టణంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ. 75, 000 విలువ కలిగిన టపాసులను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని మార్వాడి వ్యాపారి ఫ్యాన్సీ దుకాణంలో ఎస్సై శ్రీరామ్ తన సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా విక్రయించేందుకు నిలువ చేసిన టపాసులు, క్రాకర్స్ ను సీజ్ చేశారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్