పామూరు మండలం గోపాలపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బుధవారం రాత్రి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు గురువారం తరలించారు. ఈ సందర్భంగా వైద్యశాల వద్ద పామూరు ఏఎస్ఐ ముళ్ల మొహిద్దిన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంపై 106, క్రాస్ వన్ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు.