కొనకలమిట్ల ఎంపీడీవోగా ఈశ్వరమ్మ
ప్రకాశం జిల్లా, కొనకలమిట్ల ఎంపీడీవో గా ఈశ్వరమ్మ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ. మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతూ మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు.