న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు వర్షం ముప్పు

76చూసినవారు
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు వర్షం ముప్పు
భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 16 నుంచి 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మ్యాచ్ ప్రారంభమయ్యే బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉంది. టెస్టు ఆటలో మూడో రోజు (శుక్రవారం) మినహా మిగిలిన నాలుగు రోజులు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్