ప్రకాశం జిల్లా కొండపిలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించి కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.