ఒడిశాలోని రూర్కెలా లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి పెళ్లి సాకుతో 25 ఏళ్ళ యువతిపై పలుమార్లు అత్యచారానికి పాల్పడ్డాడు. పెళ్లి విషయం తెచ్చినప్పుడల్లా తప్పించుకునేవాడు. చివరికి సదరు యువతి గర్భవతి అని తెలియగానే పరారయ్యాడు. దీంతో యువతి తల్లి అతనిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గోవా వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.