ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో బుధవారం గ్రామసభను స్థానిక అధికారులు నిర్వహించారు. కనుమల్ల గ్రామంలోని సమస్యలపై చర్చించారు. భూ సమస్యల పరిష్కారం కొరకు స్థానికులు 68 అర్జీలు ఇచ్చినట్లుగా సింగరాయకొండ తహశీల్దార్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నీ పరిశీలించి ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.