సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి చెందిన చెరువుకు శుక్రవారం గండి పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా సింగరాయకొండ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. వరద ఉధృతికి వరద నీరు భారీగా వచ్చి చెరువుకు చేరడంతో జువ్వలకుంట చెరువుకు గండిపడి నీరంతా వృధా అయ్యింది. దీంతో స్థానిక రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.