టంగుటూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడడంతో పోక్సో కేసు నమోదయింది. ఆదివారం ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు గ్రామంలో పర్యటించి సంఘటన జరిగిన పాఠశాల ప్రాంగణాలను పరిశీలించారు. బాలికకు చెందిన ఇద్దరు స్నేహితులతో మాట్లాడి డీఎస్పీ వివరాలు సేకరించారు. లోతైన దర్యాప్తు చేస్తున్నామని నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని డిఎస్పి అన్నారు.