మార్కాపురం మండలంలోని పలు గ్రామాలలో ఆర్డిఎస్ఎస్ పనులను బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. తర్లుపాడు, కొనకలమిట్ల, పెద్ద యాచవరం, కలుజువ్వలపాడు, గ్రామాలలో ఎటువంటి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నూతన విద్యుత్ లైను నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా నారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.