దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

85చూసినవారు
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దపాటి విజయరాజు డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎన్జీవో హాల్ లో క్రిస్టియన్ నాయకుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎస్సీ హోదా కోసం 10 లక్షల మందితో సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని క్రైస్తవులు నిర్ణయం తీసుకున్నారన్నారు. క్రైస్తవుల పై జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాలు నోరు తెరవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్