ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో ఈనెల 11వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా స్కిల్ అధికారి రవితేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.