దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులపై టీడీపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా, కోర్టు దాన్ని సోమవారం కొట్టివేసింది. ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవాలని నోటీసులు జారీ చేశారు. వర్మ హాజరవుతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.