Apr 03, 2025, 14:04 IST/
ప్రేమ విఫలం కావడంతో యువకుడు సూసైడ్
Apr 03, 2025, 14:04 IST
TG: హైదరాబాద్ జీడిమెట్లలో ఇమ్రాన్ పాషా(27) అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రేమ విఫలం కావడంతో కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజనం చేశాక రూంలోకి వెళ్లి పడుకున్నాడని, ఉదయం ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగలగొట్టగా.. ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని చెప్పారు. కాగా ఇమ్రాన్‌కు నిశ్చితార్థం కూడా జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.