AP: వివేకా హత్య కేసుకి సంబంధించిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులు ఆయన కుమార్తెను ఏమన్నా చేస్తారనే భయ ఆమెకు ఉందని షర్మిల ఆరోపణలు చేశారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని చెప్పారు. ఎంపీ అవినాశ్ బెయిల్‌పై బయట ఉండటం వల్లనే ఆమెకు న్యాయం జరగట్లేదన్నారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందిన సంగతి తెలిసిందే.