శిథిలావస్థలో ఇంకొల్లు సచివాలయ భవనం

62చూసినవారు
శిథిలావస్థకు చేరిన ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే వణుకు పుడుతొందని ఇంకొల్లు ప్రజలు వాపోయారు. ఇంకొల్లు సచివాలయం- 1 భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ భవనం ప్రస్తుతo శిథిలావస్థకు చేరినప్పటికీ కనీసం మరమ్మతులకు నోచుకోలేదు. ఎప్పుడు పెచ్చులూడి పడతాయో తెలియక ఆ ఆఫీసుకు సమస్యలపై వెళ్లే ప్రజలు హడలిపోతున్నారు. వర్షానికి కూడా కార్యాలయంలోకి నీరు చేరుతుంది. ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్