కొమ్మమూరు కాలువ నుంచి పర్చూరు మీదుగా అన్నంబొట్లవారి పాలెం వరకు తాగునీటి పారుదల కొరకు ఏర్పాటు చేసిన పైపులైన్ వాల్వు లీకై గత కొద్దిరోజులుగా నీరు వృధాగా పోతోంది. అధికారులు స్పందించి ఇప్పటికయినా నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇలా నీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు.