మాజీ మంత్రి బాలినేని పై సీఎంకు ఫిర్యాదు

67చూసినవారు
మాజీ మంత్రి బాలినేని పై సీఎంకు ఫిర్యాదు
మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ గురువారం ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన రియాజ్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్