చదలవాడ రామాలయంలో భారీ చోరీ

590చూసినవారు
చదలవాడ రామాలయంలో భారీ చోరీ
ఆంధ్రా భద్రాచలం గా పేరు పొందిన నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలోని రామాలయంలో శుక్రవారం పొద్దు పోయాక భారీ చోరీ జరిగింది. దాదాపు 15 కిలోల స్వామి వారి వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు బోగట్టా. దొంగలు గుడిలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్