AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మోస్తరు వర్షాలు, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు కాస్త ఉపశమనం పొందవచ్చని పేర్కొంది.