
పెద్దారవీడు: జాతీయ రహదారిపై లారీ బోల్తా
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో గురువారం మిర్చి లారీ బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు నుంచి గుంటూరుకు మిర్చిలోడుతో వెళ్తున్న లారీ దేవరాజు గట్టు వద్దకు రాగానే లారీ డ్రైవర్ నిద్ర పొత్తుతో లారీ నడపడం వల్ల బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.