
పుల్లలచెరువు: లారీ ఢీకొని కాపరి మృతి
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లెపాలెం సమీపంలో శనివారం లారీ ఢీకొని ఐదు గొర్రెలు, కాపరి మృతి చెందాడు. నర జాముల తండాకు చెందిన రాములు నాయక్ గొర్రెలను మేత కోసం తీసుకువెళ్తుండగా లారీ వెనక నుంచి వచ్చి గొర్రెల కాపరిని ఢీ కొట్టింది. దీంతో రాములు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో ఐదు గొర్రెలు మృతి చెందాయి. కాపరి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.