ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామ సమీపంలో బోరు బండి బోల్తా కొట్టిన సంఘటన శనివారం జరిగింది. ఎర్రగొండపాలెం నుండి వీరభద్రాపురం వెళ్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జగలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.