ప్రకాశం జిల్లా దోర్నాల నల్లమల్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం లారీ మినీ, అశోక్ లేలాండ్ వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ 108 అంబులెన్స్ లో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో అటువైపు వెళ్ళే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను పునర్ధరించారు.