ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం జర్రిపోతు సిబ్బందికి కనిపించింది. ఫారెస్ట్ స్నేక్ రిస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మల్లికార్జున పామును పట్టుకున్నాడు. పట్టుకున్న పాము జర్రిపోతని తెలిపారు. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు తెలిపారు.