యర్రగొండపాలెం: మెగా రక్తదాన శిబిరం

58చూసినవారు
యర్రగొండపాలెం: మెగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం సిఐ ప్రభాకర్ రావు, ఎస్సై చౌడయ్య ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. దాతలను సీఐ ప్రభాకర్ రావు అభినందించారు. మీరు ఇచ్చే రక్తం అత్యవసరమైన పరిస్థితులలో అవసరమైన వారికి ఉపయోగపడుతుందని సిఐ అన్నారు.

సంబంధిత పోస్ట్