పింఛను పండగకు నగదు సిద్ధం

70చూసినవారు
పింఛను పండగకు నగదు సిద్ధం
జులై ఒకటిన ‘సామాజిక పింఛను పంపిణీ’ పండగలా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న ఆదివారం కావడం. సోమవారమే పింఛను ఇవ్వాల్సి రావడంతో ఆయా గ్రామాలకు శనివారమే నగదు తరలింపు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండల కేంద్రాల్లో అధికారులు శనివారం బ్యాంకు నుంచి నగదు డ్రా చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జులై 1న రూ.7 వేల పింఛను అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్