2024-25 రబీ సాగుకు సంబంధించిన ప్రణాళికలను ఏపీ వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు కాగా ఈసారి 57.65 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేయనున్నారు. రబీకి సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ఇవ్వనుంది.